నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 02:04 PM

నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. గోర్ఖా జిల్లా నుంచి శనివారం ఉదయం టేకాఫ్‌ అయిన ఈ హెలికాప్టర్‌ బయలు దేరిన కొద్దిసేపటికే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

జపాన్‌కి చెందిన పర్వతారోహకుడితో సహా హెలికాఫ్టర్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణికులు, పైలట్‌ ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు

‘‘హెలికాప్టర్‌ శిథిలాలను నువాకోట్-ధాఢింగ్‌ జిల్లా మధ్య పర్వతాల నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో గుర్తించాం.' అని అధికారులు తెలిపారు. 'ప్రమాదం జరిగిన ప్రదేశం 5,500 అడుగుల ఎత్తులో ఉంది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక చర్యలకు ఆటకం కలిగిస్తున్నాయి." అని ఓ అధికారి తెలిపారు.

Untitled Document
Advertisements