వైసీపీ లోకి మరో కీలక నేత

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 03:45 PM

వైసీపీ లోకి  మరో కీలక నేత

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌ కుమార్‌ శనివారం (సెప్టెంబరు 8) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ రామ్‌కుమార్‌ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ అనుచరులు కూడా వైసీపీ గూటికి చేరారు. రామ్ కుమార్‌ రెడ్డికి వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ లేదా విశాఖపట్నం ఎంపీ టికెట్‌‌ను జగన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొన్నటి వరకూ బీజేపీ తరఫున ప్రచారం చేసిన రామ్ కుమార్, ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ అంశం రాజకీయ వర్గాల్లో బాగా చర్చనీయాంశమైంది.

Untitled Document
Advertisements