జానారెడ్డిపై నోముల నర్సింహయ్య ఫైర్

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 03:54 PM

జానారెడ్డిపై నోముల నర్సింహయ్య  ఫైర్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ నాగార్జునసాగర్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఫైరయ్యారు. ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తే.. టీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేస్తానన్న జానారెడ్డి ఇప్పుడు మాటమార్చారన్నారు. ఇరువై ఏండ్ల కింద శంకుస్థాపన వేసిన వరదకాలువ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రైతు బంధు ద్వారా నియోజకవర్గంలోని రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వందకోట్లు ఆర్థికసాయం చేసిందని, ఆ విషయం జానారెడ్డికి తెలియదా అని గుర్తు చేశారు. ఓడిపోతామని తెలిసినా కాంగ్రెస్‌ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ కోటలు కూలడం ఖాయమన్నారు. జానారెడ్డిని ఓడించేందుకు ప్రజలు తహతహలాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే రైతుబంధు, రైతు బీమా పథకాలు వచ్చేవా? అని ప్రశ్నించారు

Untitled Document
Advertisements