మాజీ సీఎం అంజయ్య సతీమణి కన్నుమూత

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 04:19 PM

మాజీ సీఎం అంజయ్య సతీమణి కన్నుమూత

మాజీ సిఎం టి.అంజయ్య సతీమణి, మాజీ ఎంఎల్‌ఎ మణెమ్మ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణెమ్మ 1942, ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లో జన్మించారు. 1960లో టంగుటూరి అంజయ్యతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మణెమ్మ సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2008లో ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందారు. అంజయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలతో పాటు ఓ కొడుకు ఉన్నారు. మణెమ్మ మృతిపై కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Untitled Document
Advertisements