24 గంటలు వాట్సాప్ లోనే

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 04:36 PM

24 గంటలు వాట్సాప్ లోనే

వింత కారణం చూపి ఓ వరుడి బంధువులు వివాహం రద్దు చేసుకున్నారు. వధువు అతిగా వాట్సప్‌ వాడుతోందని అలాంటి కోడలు తమకు వద్దని వరుడి తరుఫున వారు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.అమ్మాయి తండ్రి ముఖం మీదే ఈ పెళ్లి జరగదని వరుడి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పేశారు.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాకు చెందిన యువతికి లక్నోకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఫంక్షన్ హాల్ వద్ద వధువు కుటుంబ సభ్యులు వరుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న వరుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లి జరగదని కుండబద్దలు కొట్టారు. అమ్మాయి 24 గంటలు వాట్సాప్ లోనే ఉంటోందనీ, వాట్సాప్ కు బానిసైన కోడలు తమకు వద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

మొదట కట్నంగా 64 లక్షలు డిమాండ్‌ చేశారని.. వారు అడిగినంత కట్నం తాము ఇవ్వనందుకు తమ కుమార్తెపై అనవసరంగా నింధలు మోపుతున్నారని పోలీసుల వద్ద వాపోయారు. ఈ మేరకు వరుడి బంధువులను విచారిస్తామని పోలీసులు తెలపడంతో వారు శాంతించారు.





Untitled Document
Advertisements