హనుమ విహారి అరుదైన రికార్డు

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 04:56 PM

 హనుమ విహారి అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ పేలవంగా సాగుతోంది. వారి బ్యాటింగ్‌ సరిళి చూస్తే ఈసారి కూడా ఓటమి తప్పదన్నట్లుగా ఉంది. అయితే.. తన కెరియర్లో తొలి టెస్ట్‌ను ఆడుతున్న హనుమ విహారి ఐదో వికెట్‌గా క్రీజులోకి వచ్చి నిలదొక్కుకున్నాడు. తన తొలి మ్యాచ్ లో నే అదరగొట్టిన హనుమ విహారి టెస్ట్స్ లో తొలి అర్ద శతకం బాదాడు. ఈ అరుదైన రికార్డు విహారి కేవలం 104 బంతుల్లో చేయడం విశేషం. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. రవీంద్ర జడేజా అతడికి సహకారం అందిస్తున్నాడు

ప్రస్తుతం భారత స్కోర్ 220/6 .Untitled Document
Advertisements