తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పై ఈసీ స్పష్టత

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 06:38 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పై   ఈసీ స్పష్టత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయని, డిసెంబర్‌లో ఫలితాలు వస్తాయని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చెప్పడం తెలిసిందే. తాము తప్ప ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయొద్దని ఈసీ తర్వాత అసహనం వ్యక్తం చేసింది. అయితే కేసీఆర్ చెప్పినట్లే ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు స్పష్టమైన వెలువడుతున్నాయి.

అక్టోబరు 8 తర్వాత ఎప్పుడైనాసరే ఎన్నికలు జరిగే అవకాశముందని శనివారం విడుదలైన ఈసీ ప్రకటనతో అర్థమవుతోంది. ముందస్తు ఎన్నికలకు వీలుగా ఓటర్ల జాబితా సవరణను రద్దు చేశారు. ఈనెల 10న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల అవుతుంది. అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్‌ 8న తుది జాబితా తుది జాబితా విడుదల చేస్తారు.

Untitled Document
Advertisements