4వ రోజు భారత్ పట్టు బిగిస్తుందా

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 11:13 AM

4వ రోజు  భారత్ పట్టు బిగిస్తుందా

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో 292 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. ఈ టూర్లో చివరి టెస్ట్ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భారత క్రీడకారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ లో జడేజా, విహారీలు భారత్ ను ఆదుకున్నారు. వీరు కనీసం ఆదుకోవడం ఆ మాత్రం స్కోరు సాధించాలని చెప్పవచ్చు.

ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్‌ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి టెస్టు ఇన్నింగ్స్‌ ఆడుతోన్న కుక్‌ (125 బంతుల్లో 46 బ్యాటింగ్‌; 3 ఫోర్లు)తోపాటు కలిసి కెప్టెన్‌ రూట్‌ (43 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్‌ తీశారు. ప్రస్తుతం 40 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Untitled Document
Advertisements