పాదాచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 11:46 AM

పాదాచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

* ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మరణించిన సంఘటన గచ్చిబౌలి చౌరస్తాలో జరిగింది. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఈరోజు ఉదయం రోడ్డు దాటుతున్న పాదచారులపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే హెచ్‌సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్‌ అనే ఆటో డ్రైవర్‌ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలుఉ విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Untitled Document
Advertisements