టెలికం సంస్థలపై కొరడా

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 11:50 AM

టెలికం సంస్థలపై కొరడా

టెలికం నియంత్రణ మండలి ట్రాయ్.. టెలికం సంస్థలపై కొరడా ఝులిపించబోతున్నట్లు తెలుస్తున్నది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమైనందుకుగాను భారీ జరిమానా విధించినట్లు తెలుస్తున్నది. జరిమానాకు గురైన సంస్థల్లో జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు ఉన్నాయి. 2017 అక్టోబర్ 1 నుంచి సేవల ప్రమాణాలను ట్రాయ్ కఠినతరం చేసింది. జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో సేవల లోపాలకు సంబంధించి పెనాల్టీని విధించింది. జియోకు రూ. 34 లక్షలు, ఎయిర్ టెల్ కు రూ. 11 లక్షలు, ఐడియాకు రూ. 12.5 లక్షలు, వొడాఫోన్ కు రూ. 4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ జరిమానాలపై సదరు టెలికాం కంపెనీల ప్రతినిధులు ఇంకా స్పందించలేదు.

Untitled Document
Advertisements