చిరంజీవి ఓ మంచి పుస్తకం లాంటి వారు

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 12:14 PM

 చిరంజీవి ఓ మంచి పుస్తకం లాంటి వారు

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాకు తనని దర్శకుడిగా ఎంపిక చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంటున్నాడు సూరి. ఖైది నంబర్ 150 తర్వాత భారీ సినిమా చేయాలని చిరు అనుకోగా అదే టైంలో ఉయ్యాలవాడ కథ ఓకే చేయడం ఆ టైంలోనే తాను చరణ్ తో చేసిన ధ్రువ సినిమా హిట్ అవడం ఈ ఛాన్స్ తనని వరించిందని అంటున్నాడు సురేందర్ రెడ్డి.

అయితే చిరంజీవితో పనిచేస్తున్న ఈ క్రమంలో ఆయన వ్యక్తిత్వం తెలుసుకున్నానని. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషని.. ఆయన నుండి చాలా విషయాలు తెలుసుకున్నానని అంటున్నాడు సురేందర్ రెడ్డి. చాలా విషయాలు నేర్చుకున్నానని చిరంజీవి ఓ మంచి పుస్తకం లాంటి వారని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కమర్షియల్ పంథాలో సినిమాలు తీసే తనకి హిస్టారికల్ మూవీ కొత్త అయినా తన మీద ఉంచిన నమ్మకానికి తాను సినిమా గొప్పగా తీస్తానని చెబుతున్నాడు.

Untitled Document
Advertisements