అనుమతి లేకుండా ఏ పనీ చేయను

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 12:35 PM

అనుమతి లేకుండా ఏ పనీ  చేయను

సమంత కథానాయికగా నటిస్తున్న యూ-టర్న్ మూవీ ఈ నెల 13 న విడుదల కాబోతుంది . ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా తన భర్త గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది . తన భర్త, హీరో చైతన్య విషయంలో మాత్రం అతని అనుమతి లేకుండా ఏ పనీ చేయనంటోంది. సోషల్‌ మీడియాలో చైతూకి సంబంధించి వీడియో అయినా ఫొటో అయినా పెట్టాలంటే ముందు అతని అనుమతి కోరతానని చెబుతోందీ ఈ అందాల భామ

తనతోపాటు చైతన్య చిత్రాల విషయాలే కాదు వ్యక్తిగత విషయాలను కూడా సామ్‌ అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Untitled Document
Advertisements