హీరో 'శ్రీకాంత్ మరో బోల్డ్‌ ఆపరేషన్‌

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 12:47 PM

హీరో 'శ్రీకాంత్ మరో బోల్డ్‌ ఆపరేషన్‌

ఫ్యామిలీ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తేచ్చుకున్న హీరో 'శ్రీకాంత్'.. ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలలో కూడా మార్పు చూపిస్తున్న ఈ హీరో.. సమాజంపై రాజకీయ ప్రభావాన్ని చూపిస్తూ.. తీస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. త్వరలో మరో పొలిటికల్ మూవీతో పలుకరించబోతున్నాడు శ్రీకాంత్.. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్న శ్రీకాంత్.. మాస్ మూవీస్ కి దూరంగా క్లాస్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించికున్నాడు. ఆ తరువాత మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు రూట్ మార్చిన 'శ్రీకాంత్' ఆ తరువాత 'మహాత్మ', 'ఆపరేషన్ దుర్యోదన' లాంటి సినిమాలో.. పొలిటికల్ టచ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు.

'ఆపరేషన్ దుర్యోదన' లాంటి మూవీస్ కి మంచి టాక్ రావడంతో 'శ్రీకాంత్' జోనర్ మారిపోయింది. ప్రజంట్ అలాంటి పొలిటికల్ మూవీతో మళ్లీ రాబోతున్నాడు. సమకాలీన రాజకీయ ,సామాజిక అంశాలను కథలుగా చేసుకుని అలివేలు ప్రొడక్షన్స్ పతాకంపై కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్-2019. 'శ్రీకాంత్' హీరోగా యజ్ఞా శెట్టి, దీక్షా పంత్ హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. "ఆపరేషన్ దుర్యోధన"లాంటి బోల్డ్ పొలిటికల్ ఎటెంప్ట్ తో థియేటర్లోకి వస్తున్న ఈ సినిమాలో, సుమన్, కోట, పోసాని, శివకృష్ణ, నాగినీడు లాంటి సీనియర్స్ నటిస్తున్నారు. ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో 'శ్రీకాంత్' హీరోగానే కాకుండా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Untitled Document
Advertisements