నా జీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 12:59 PM

నా జీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు

2018 సెకండాఫ్‌లో అద్భుతమైన విజయం సాధించిన చిత్రాల్లో ‘ఆర్‌‌ఎక్స్100’ చిత్రం మొదటి ప్లేస్ లో ఉంటుంది . కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో మరో బ్లాక్ బ్లాస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నది . ఈ సినిమాతో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్‌కు ఒక్కసారిగా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఒక్క హిట్‌తో వీరిద్దరు టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు.అయితే ఈ సినిమా హీరో కార్తికేయ ఎప్పటినుంచో కంటున్న కల ఇటీవలే నిజమైందట. కార్తికేయ.. కింగ్ నాగార్జునతో కలిసి దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

కల నిజమవడం అనడానికి ఇది నిదర్శనం. ఆర్‌ఎక్స్100 బ్లాక్‌బస్టర్ అయినప్పుడు కూడా ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నాగార్జున సార్‌తో.. నా జీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అని కార్తికేయ పేర్కొన్నాడు.

Untitled Document
Advertisements