ఏపీలో కొనసాగుతున్న బంద్

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 02:03 PM

ఏపీలో కొనసాగుతున్న బంద్

అమరావతి: కాంగ్రెస్ తో సహా విపక్షాలు ఇచ్చిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. అధికార పార్టీ టీడీపీ తో సహా అన్ని విపక్షపార్టీలు బంద్ లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతూ....‘ మోదీ ప్రభుత్వంపై భారత్ బంద్ ప్రభావం కచ్చితంగా పడుతుంది. దేశంలోని ప్రజలకీ ఈ బంద్ ప్రభావం తెలుస్తుందని అన్నారు.
విజయవాడ బస్టాండ్‌ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్‌కు మద్దతుగా నగరంలోని విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. అటు గుంటూరులోనూ వామపక్ష, జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు బస్టాండ్‌ వద్ద బస్సులను అడ్డుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు అన్ని బస్ డిపోల ముందు తెల్లవారుజామునే విపక్ష పార్టీలు నిరసన చేపట్టారు. దీంతో అన్ని డిపోల్లో ఉన్న బస్సులు నిలిచిపోయాయి.

Untitled Document
Advertisements