బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగల పార్టీలు : పొన్నం

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 02:36 PM

బీజేపీ, టీఆర్ఎస్ రెండు  తోడు దొంగల పార్టీలు : పొన్నం

కరీంనగర్: బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగల పార్టీలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేసీఆర్ తన వైఖరి చెప్పాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు.
అధిష్ఠానం ఆదేశిస్తే కరీంనగర్ నుంచి పోటీకి సిద్ధమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారికీ ఓటమి తప్పదని వివరించారు.

Untitled Document
Advertisements