పొత్తులపై చర్చిస్తున్నాం

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 02:52 PM

పొత్తులపై చర్చిస్తున్నాం

హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు కోసం చర్చిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాసంలో తెదేపా నేతలతో చాడ వెంకటరెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ, తెదేపా మధ్య ఒక అవగాహన కుదిరిందని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు.
మహాకూటమి ఏర్పాటు చేసి తెరాసను ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. తెరాసను ఓడించటమే ప్రధాన లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు కానుందని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితితో కూడా చర్చలు జరుపుతామని, మిగిలిన పక్షాలతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు.
తెరాస ఓటమి దిశగా అన్ని రాజకీయ వర్గాలను కలుపుకపోతామని అన్నారు. పొత్తులపై అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Untitled Document
Advertisements