చంద్రబాబు నా డైలాగ్ ని కాపీ కొట్టాడు.

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 03:39 PM

చంద్రబాబు నా డైలాగ్ ని కాపీ  కొట్టాడు.

* వైఎస్ జగన్ దేవుడు
* హాస్యనటుడు పృథ్వీరాజ్‌

ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్‌ ఓ సంచలన విషయాన్నివెల్లదించాడు. .ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైఎస్ జగన్ కు మద్దతు పలికిన తర్వాత తనకు చాలా బెదిరింపులు వచ్చాయని పృథ్వీరాజ్‌ అన్నారు. అయితే, ఇలాంటి వాటికి తాను భయపడబోనని, వాళ్లందరికీ జవాబిచ్చానని తెలిపారు. వైఎస్ జగన్ తన దేవుడనీ, ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని పృథ్వీ వ్యాఖ్యానించారు.

తాను చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ ను చంద్రబాబు కాపీ కొట్టి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అటూ ప్రచారం చేసుకుంటున్నారని పృథ్వీ ఎద్దేవా చేశారు. ఎందరో కళాకారులకు, నటులకు జన్మనిచ్చిన నెల్లూరులో హాస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు.

ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్‌ నిన్న నెల్లూరు పురమందిరంలో నిర్వహించిన కళాంజలి సాంస్కృతిక సంస్థ, కళాంజలి కామెడీక్లబ్‌ అందించే హాస్యచక్రవర్తి టీవీ రమణారెడ్డి స్మారక అవార్డును అందుకున్నారు. అయన గతంలో వైస్ జగన్ కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements