తెలంగాణ జనసమితిలో భగ్గుమన్న విభేదాలు.

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 04:22 PM

తెలంగాణ జనసమితిలో భగ్గుమన్న విభేదాలు.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణాలో అన్ని పార్టీల్లో రాజకీయ విభేదాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ జనసమితిలో కూడా విభేదాల వాళ్ళ పార్టీ నుండి బయటికి వస్తున్నారు. మహిళా నేత జ్యోత్స్న టీజేఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో వ్యాపారం నడుస్తోందని, పార్టీ పేరు చెప్పి కపిలవాయి దిలీప్ కుమార్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ అంబర్‌పేట నియోజవర్గంలో పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నానని తెలిపారు. తాను టిక్కెట్ల కోసం పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఏ సిద్ధాంతాల కోసం పార్టీ పెట్టారో, ఆ సిద్ధాంతాలకోసం పని చేయడం లేదని జ్యోత్స్న ఆరోపించారు. దిలీప్‌కుమార్ తన వద్ద రూ. 2 లక్షలు తీసుకున్నారని, బయటకు రావాలంటే తాను ఆరోజే వచ్చేదాన్నని ఆమె అన్నారు. ఈ విషయాలన్ని అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వక్త్యం చేసారు.

సిద్దాంతాలను పక్కనపెట్టి డబ్బు వసూలు లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని, అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని జ్యోత్స్న స్పష్టం చేశారు. త్వరలో మరికొంతమంది పార్టీ నుంచి బయటకొస్తారని ఆమె అన్నారు. ఇతర టీజీఎస్ మహిళా నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారని ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని తెలిపారు.

Untitled Document
Advertisements