టీడీపీని ఒంటరి చేయాలని కేంద్రం కుట్ర

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 10:49 AM

టీడీపీని ఒంటరి చేయాలని కేంద్రం కుట్ర

* తెలుగు రాష్టాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు.
* ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగేతే టీడీపీని ఒంటరి చేయాలనే కుట్ర పన్నుతున్నారని కేంద్రం పై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని అన్నారు. అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, విప్‌లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలే ముందు’ అనేది తెలుగుదేశం పార్టీ నినాదమని ఉద్ఘాటించారు. అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పిన భాజపా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌తో అంటకాగుతోందని మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే లోక్‌సభకు గైర్హాజరు అయ్యారని... దిల్లీకి వస్తామని చెప్పినవాళ్లు పత్తాలేకుండా పోయారని అన్నారు. కేంద్రం వైఫల్యాలపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నోరు తెరవడం లేదని మండిపడ్డారు.

కేంద్రం ప్రజా వ్యతిరేక చర్యల వల్లే ఎన్డీయే నుంచి తెదేపా వైదొలిగిందని స్పష్టం చేశారు. అందువల్లే కర్ణాటకలో భాజపాయేతర పార్టీలకు తెలుగుదేశం మద్దతు ఇచ్చిందని తెలిపారు. వైకాపా మాత్రం భాజపాకు అనుకూలంగా ప్రచారం చేసిందని ఆరోపించారు. వేల కోట్ల ఆర్ధిక లోటులో ఉండి కూడా పెట్రో ధరల తగ్గించడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. లీటరుకు 2 రూపాయల తగ్గింపు పేదలకెంతో ఊరట నిచ్చిందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం వేస్తుందని అన్నారు. కొంచెం కూడా ఉదాసీనత లేదని విమర్శించారు.

Untitled Document
Advertisements