కోర్టుకు ప్రముఖ క్రికెటర్‌

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 11:16 AM

 కోర్టుకు ప్రముఖ క్రికెటర్‌

సైబర్‌ క్రైం కేసులో సాక్ష్యం చెప్పేందుకు కూకట్‌పల్లి కోర్టుకు ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హాజరయ్యారు. హైదరాబాద్, సనత్ నగర్ లోని డీసీబీ బ్యాంకులో లక్ష్మణ్‌కు అకౌంట్ ఉంది. 2014లో ఓ హ్యాకర్ ఈ అకౌంట్ నుంచి రూ.10 లక్షలు తస్కరించాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ సూచనతో లక్ష్మణ్ పోలీసులను ఆశ్రయించాడు.పోలీసులు 2015లో నిందితుడిని పట్టుకొని నగదు రికవరీ చేశారు. కేసు విషయంలో సాక్ష్యం చెప్పేందుకు లక్ష్మణ్‌ కోర్టుకు హాజరయ్యారని న్యాయవాది హర్షవర్ధన్‌ తెలిపారు.

Untitled Document
Advertisements