సంగారెడ్డిలో కొనసాగుతున్న బంద్

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 12:03 PM

సంగారెడ్డిలో కొనసాగుతున్న బంద్

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో సంగారెడ్డి పట్టణంలో బంద్ కొనసాగుతుంది. మీ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్బంగా ర్యాలీ నిర్వహిస్తూ బంద్ నిర్వహించారు. ఈ బంద్ సందర్బంగా డిపోల్లోని బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దుకాణ సముదాయాలు అన్ని మూసివేశారు. కాగా నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి మానవ అక్రమ రవాణా చేశారనే కేసులో నిన్న జగ్గారెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements