భారత్‌ లక్ష్యం 464 , ధావన్, పుజారా, కోహ్లి ఔట్‌

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 12:21 PM

భారత్‌ లక్ష్యం 464 , ధావన్, పుజారా, కోహ్లి ఔట్‌

నాలుగో రోజు సోమవారం 464 పరుగుల ఛేదనలో కోహ్లి సేన ఆట ముగిసే సమయానికి 58/3తో నిలిచింది. మరో 406 పరుగులు వెనుకబడి ఉంది. భారమంతా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (46 బ్యాటింగ్‌), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (10 బ్యాటింగ్‌)పైనే

అలిస్టర్ కుక్ తన చివరి మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసిన కుక్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఓవల్ లో సెంచరీతో కుక్ తన టెస్టు కెరీర్ లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 114/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌... ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (286 బంతుల్లో 147; 14 ఫోర్లు), కెప్టెన్‌ జో రూట్‌ (190 బంతుల్లో 125; 12 ఫోర్లు, 1 సిక్స్‌)ల శతకాలతో 423/8 వద్ద డిక్లేర్‌ చేసింది. జడేజా (3/179), విహారి (3/37)లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఓపెనర్‌ ధావన్‌ (1), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా, కెప్టెన్‌ కోహ్లిల డకౌట్‌తో టీమిండియా విజయం దారులు మూసుకుపోయాయి.

Untitled Document
Advertisements