కొండగట్టు ఘాట్ రోడ్డులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 12:29 PM

కొండగట్టు ఘాట్ రోడ్డులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

జగిత్యాల : జగిత్యాల జిల్లా లోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తున్న సమయంలో ప్రమాదమైన మూల మలువు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన ఆర్టీసీ బస్సుగా అధికారులు గుర్తించారు. డ్రైవర్ నిర్లక్షంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెపుతున్నారు.

Untitled Document
Advertisements