'న‌న్ను దోచుకుందువ‌టే’ మూవీ ట్రైల‌ర్

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 01:40 PM

'న‌న్ను దోచుకుందువ‌టే’ మూవీ ట్రైల‌ర్

సుధీర్ బాబు హీరోగా సొంతం నిర్మాణం లో వస్తున్న సినిమా నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్ నాయుడు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ట్రైలర్ మొత్తం కామెడీ, పంచులతో సాగింది. స్ట్రిక్ట్ ఎంప్లాయ్ అయిన సుధీర్ బాబు.. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తో సాగించే లవ్ స్టోరీనే నన్ను దోచుకుందువటే సినిమా.

ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. సెప్టెంబర్ 21న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై సుధీర్ బాబు భారీ హోప్స్ పెట్టుకున్నాడు. సీనియర్ ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ సాంగ్ నన్ను దోచుకుందువటే పాటనే టైటిల్ గా వాడేసిన సుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. సుధీర్ బాబు ఎలాంటి ప్రయత్నం చేసినా ఘట్టమనేని ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి సుధీర్ ఈ మూవీతో సత్తా చాటేలా కనిపిస్తున్నాడు.

Untitled Document
Advertisements