కొండగట్టు ఘటన విషాదకరం

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 05:11 PM

కొండగట్టు ఘటన విషాదకరం

* చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని
ప్రార్థిస్తున్నాను.
* తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని
కోరుతున్నా
* జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం జరగడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాటలకు అందని విషాదం. ఇలాంటి ఘటనలు మళ్లి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

తెలంగాణలోని కొండగట్టు ఘాట్ రోడ్ బస్సు ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందారని, మరో పదిమంది గాయపడ్డారని తెలిసిన వెంటనే మనసంతా భారంగా దుఃఖంతో నిండిపోయిందని పవన్ దిగ్బ్రాంతి వక్తం చేశారు. మృతిచెందిన వారిలో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉండడం మరింత బాధాకరం అని అన్నారు.

డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణమవటం మరింత భాధాకరమని ఇలాంటి ఘటనలు జరగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మృతులకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Untitled Document
Advertisements