మజ్లీస్ మొదటి జాబితా విడుదల

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 11:31 AM

త్వరలో జరుగనున్న తెలంగాణా శాసనసభ ఎన్నికల కోసం ఒక్కో పార్టీ తమా అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం మొదలుపెట్టింది. టిఆర్ఎస్‌ తరువాత దానికి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీ ఈరోజు తొలి జాబితాను విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలో మజ్లీస్ పోటీ చేయబోతున్న ఏడుగురు అభ్యర్ధుల వివరాలను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. వారి వివరాలు (బ్రాకెట్లలో పేర్కొన్నవారు టిఆర్ఎస్‌ అభ్యర్ధులు)

చంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఓవైసీ X (ఎం.సీతారాం రెడ్డి)

యాకుత్‌పుర: సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ X (సామ సుందర్ రెడ్డి)

చార్మినార్: ముంతాజ్ అహ్మద్‌ఖాన్ X (ఇంకా ప్రకటించవలసి ఉంది)

బహదూర్‌పుర: మహ్మద్ మొజంఖాన్ X (ఇయాఖత్ ఆలీ)

మలక్‌పేట్: అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల X (ఇంకా ప్రకటించవలసి ఉంది)

నాంపల్లి: జాఫర్ హుస్సేన్ మేరాజ్ X (మునుకుంట్ల ఆనంద్ గౌడ్)

కార్వాన్: కౌసర్ మొహిద్దీన్ X (జీవన్ సింగ్).

Untitled Document
Advertisements