ఎన్ని కుట్రలు చేసిన చెన్నూర్ నుండే పోటి చేస్తా : బాల్క సుమన్

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 03:26 PM

ఎన్ని కుట్రలు చేసిన చెన్నూర్ నుండే పోటి చేస్తా :
బాల్క సుమన్

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పర్యటనలో ఎంపీ బాల్క సుమన్ కు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం ఇందారం గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ నేపద్యంలో ఓదేలు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఒంటిపై పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై స్పందించిన బాల్క సుమన్ చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని బాల్క సుమన్ చెప్పారు. ఎవరి సీటును తాను కావాలని తీసుకోలేదని అన్నారు.

ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో తాను చెన్నూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోలు పోసి, అగ్గిపుల్ల వేసేందుకు యత్నించారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసిన తానూ చెన్నూర్ నుండే పోటీ చేస్తానని అన్నారు. కాగా ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒంటిపై పెట్రోలు పోసుకున్న ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Untitled Document
Advertisements