చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 05:03 PM

 చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం దక్కనుంది. ఐరాస నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం లో పురుగుమందులను తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవశ్యకతపై ప్రసంగించనున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీన ఎపిఎన్‌ఆర్‌టీ, ఎన్నారై టీడిపి ఇతర సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

26వ తేదీన అమెరికా వ్యాపార వాణిజ్య ప్రముఖుల తోనూ, భారతీయ సంతతి ప్రముఖుల తోనూ సమావేశమవుతారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కూడా ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనేందుకోసం 10వ తేదీన అమెరికా బయలు దేరుతున్నారు. ఆయన కూడా న్యూజెర్సి ముఖ్యమంత్రి సభలో పాల్గొంటున్నారు.

Untitled Document
Advertisements