నేడు రాహుల్ గాంధీని కలువనున్న ఉత్తమ్

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 01:20 PM

నేడు రాహుల్ గాంధీని కలువనున్న ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గత కొద్ధి రోజులుగా సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, సీపీఐ పార్టీల మధ్య పొత్తు ఒక కొలిక్కి వచ్చిన సందర్బంగా ఈ రోజు సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తుల చర్చల వివరాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఉత్తమ్‌ వివరించనున్నారు. అలాగే సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హైకమాండ్‌తో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చించనున్నారు.

Untitled Document
Advertisements