విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 01:55 PM

గుంటూరు: కరెంటు షాక్ తగిలి ముగ్గురు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గనికపుడిలో జరిగింది. ఈ ఘటనలో తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఏసు(28), చిన్నారులు సల్మాన్ (6), ఏస్తరి (3)గా గుర్తించారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంగా తెలుస్తోంది. గనికపూడిలో బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Untitled Document
Advertisements