అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సి వేస్తాం : ఉత్తమ్

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 03:24 PM

అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సి వేస్తాం : ఉత్తమ్

హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి 20వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు నెలకు రూ . 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలను భర్తి చేస్తామన్నారు. టీచర్లను కేసీఆర్ నాలుగున్నర ఏళ్లుగా మోసం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. పే రివిజన్ కమిషన్‌ను అమలు చేస్తామని చెప్పారు.

టీడీపీ, సీపీఐలతో పొత్తులపై చర్చించామే తప్ప సీట్ల గురించి చర్చించలేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ సన్యాసం తీసుకుంటారని...కేటీఆర్ అమెరికా వెళతారని జోస్యం చెప్పారు. తెలంగాణను రక్షించుకునేందుకు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌తో వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొండగట్టు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇతర నేతలతో కలిసి తాము కొండగట్టు ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements