రివ్యూ : 'శైలజారెడ్డి అల్లుడు'

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 04:35 PM

రివ్యూ : 'శైలజారెడ్డి అల్లుడు'

సినిమా పేరు: శైల‌జారెడ్డి అల్లుడు

న‌టీనటులు: అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్‌, న‌రేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, పృథ్వీరాజ్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు

ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ

సంగీతం: గోపీసుంద‌ర్‌

స‌మ‌ర్ప‌ణ‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)

నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం: మారుతి

సంస్థ‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

విడుద‌ల‌: 13 సెప్టెంబ‌రు 2018

క‌థ‌:
చైతూ(నాగ‌చైతన్య‌) బిజినెస్ మ్యాన్. అత‌డి తండ్రి రావు(ముర‌ళి శ‌ర్మ‌) పెద్ద ఇగోయిస్ట్. ప్ర‌తీ చిన్న విష‌యానికి కూడా ఇగో అడ్డు ప‌డుతుంటుంది. అలాంటి ఇగో ఉన్న మ‌నిషికి ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న కొడుకు చైతూ. అలాంటి వాడికి అంతే ఇగో ఉన్న అను(అను ఎమ్మాన్యువ‌ల్) కు క‌నెక్ట్ అయిపోతాడు. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే త‌న‌తో పెళ్ళి జ‌ర‌గాలంటే ముందు త‌న త‌ల్లి శైల‌జారెడ్డి(ర‌మ్య‌కృష్ణ‌)ను ఒప్పించాల‌ని కండీష‌న్ పెడుతుంది అను. తీరా చూస్తే అను కంటే ప‌ది ట‌న్నులు ఎక్కువ ఇగో ఉన్న అత్త శైల‌జారెడ్డి. మ‌రి ఆమె పొగ‌రును అల్లుడు ఎలా అణిచాడు అనేది క‌థ‌.

న‌టీన‌టులు:
నాగ‌చైత‌న్య లుక్ లో కొత్తద‌నం క‌నిపించింది. ఆయ‌న న‌ట‌న‌లో కూడా కొత్త‌గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చైతూకు ఇప్పుడు అల్లుడుగా చూసిన చైతూ చాలా చ‌లాకీగా క‌నిపించాడు. అయితే క‌థ కూడా అంతే చ‌లాకీగా ఉంటే బాగుండేది. అను ఎమ్మాన్యువ‌ల్ పాట‌ల‌కు మ‌రోసారి బాగా ప‌రిమితం అయిపోయింది. ఇగో ఉన్న పాత్ర‌లో మెప్పించ‌లేక‌పోయింది. ర‌మ్య‌కృష్ణ అయితే సినిమాను న‌డిపించింది. ఆమె పాత్రే క‌థ‌కు కీల‌కం. బాహుబ‌లి రేంజ్ లో మ‌రోసారి రెచ్చిపోయింది ఈ శివ‌గామి. ఇగో ఫాద‌ర్ గా ముర‌ళిశ‌ర్మ.. హీరోయిన్ ఫాద‌ర్ గా న‌రేష్ అలా చూస్తుండి పోయారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

సాంకేతికవర్గం:

గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. ఎగిరెగిరే పాట ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకో రెండు పాటలు ఓకే. పాటల చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతం బాగానే ఉంది. నిజార్ షఫి ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ప్రతి సన్నివేశంలోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక రచయిత.. దర్శకుడు మారుతి తన ప్రధాన బలమైన వినోదం పండించడంలో అంచనాల్ని అందుకోలేకపోయాడు. కథ.. కథనం రెండింట్లోనూ కొత్తదనం చూపించలేకపోయాడు. రచయితగా.. దర్శకుడిగా అతడి ముద్ర కనిపించలేదు ఇందులో.

రేటింగ్-2.5/5

Untitled Document
Advertisements