టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు : కోమటిరెడ్డి

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 04:56 PM

టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు :  కోమటిరెడ్డిహైదరాబాద్ : తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాదిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో ఓటు బ్యాంకు లేని టీడీపీతో పొత్తు అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ పొత్తు గురించి వివరిస్తానని అన్నారు. మహా కూటమిలో విపక్షాలకు 10 సీట్లకె పరిమితం చేయాలని అన్నారు. దక్షణ తెలంగాణాలో తెరాసకు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఎందుకు వెళ్తున్నారో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారని అయన వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements