'యు ట‌ర్న్‌' మూవీ రివ్యూ

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 04:59 PM

'యు ట‌ర్న్‌' మూవీ రివ్యూ

టైటిల్ : యు ట‌ర్న్‌

జానర్ : సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌

తారాగణం : స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్‌

సంగీతం : పూర్ణచంద్ర తేజ‌స్వీ

దర్శకత్వం : ప‌వ‌న్ కుమార్‌

నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు

క‌థ‌:

ర‌చ‌న‌(స‌మంత‌) ఓ రిపోర్ట‌ర్. ఓ ఫ్లై ఓవ‌ర్ పై వ‌ర‌స‌గా జ‌రుగుతున్న ప్ర‌మాదాల గురించి స్టోరీ కోసం స్ట‌డీ చేస్తుంటుంది. ఆ స‌మ‌యంలో అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేస్ లో ఇరుక్కుంటుంది ర‌చ‌న‌. ఈ కేస్ లో తాను నిర్ధోషి అని చెప్పినా పోలీసులు న‌మ్మ‌రు. కానీ ఆమెకు పోలీస్ ఆఫీస‌ర్ నాయ‌క్(ఆది పినిశెట్టి) సాయం చేస్తుంటాడు. ర‌చ‌న‌ను కేస్ నుంచి బ‌య‌టికి తీసుకురావ‌డ‌మే కాదు.. అస‌లు ఆ మ‌ర్డ‌ర్స్ ఎలా జ‌రుగుతున్నాయి.. ఎవ‌రు చేస్తున్నారు అనే విష‌యంపై కూడా ఇన్వెస్టిగేష‌న్ చేస్తుంటారు. అప్పుడు తెలుస్తుంది ఈ మ‌ర్డ‌ర్స్ వెన‌క ఓ త‌ల్లి బిడ్డ (భూమిక చావ్లా) ఉన్నార‌ని. అస‌లు వాళ్లెందుకు ఇంత‌మందిని చంపేస్తుంటారు..? అనేది అస‌లు క‌థ‌..

న‌టీన‌టులు ;

ఇన్నాళ్లు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత ప్రస్తుతం న‌టిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అందుకే న‌ట‌నకు ఆస్కారం ఉన్న పాత్రల‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. యు ట‌ర్న్ సినిమాను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారు. తన పర్ఫామెన్స్‌ తో సినిమా స్థాయిని పెంచారు సమంత. ప్రేమ, భ‌యం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించారు. డబ్బింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు.

ప్లస్‌ పాయింట్స్ :
సమంత నటన
నేపథ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్ :

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు లేకపోవటం

యూ ట‌ర్న్.. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ విత్ మెసేజ్..

Untitled Document
Advertisements