కొండగట్టు ఘటన విషాదకరం : ఉత్తమ్

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 06:44 PM

కొండగట్టు ఘటన విషాదకరం : ఉత్తమ్

జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘటన విషాదకరమని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వక్తం చేసారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలిని అన్నారు. కొండగట్టు ప్రమాదస్థలినిఈరోజు ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు కూడా ప్రమాదస్థలికి వచ్చారు. ఆ తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీని టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 25 వేల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మూడు నెలల్లో మృతుల కుటుంబాలకు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Untitled Document
Advertisements