తెలుగు దర్శకుడు కన్నుమూత

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 07:12 PM

తెలుగు దర్శకుడు కన్నుమూత

ప్రముఖ రచయిత, సినీ విమర్శకులు, దర్శకులు కె.ఎన్.టి శాస్త్రి (73) మృతిచెందారు. గత ఏడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను కేఎన్‌టీ శాస్త్రి గెలుచుకున్నారు. పత్రికల్లో జర్నలిస్టుగా కేఎన్‌టీ శాస్త్రి తన కెరీర్‌ను ప్రారంభించారు. సినీ దర్శకుడు, విమర్శకుడు, రచయితగా శాస్త్రి ప్రసిద్ధి చెందారు. తిలదానం, కమిలి తదితర చిత్రాలకు శాస్త్రి దర్శకత్వం వహించారు.

Untitled Document
Advertisements