19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 11:50 AM

19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా... కఠిన శిక్షలు విధిస్తున్నా అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. హర్యానాలో ఇలాంటి ఘోరమే జరిగింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో టాపర్ గా నిలిచి, రాష్ట్రపతి అవార్డును అందుకున్న ఓ చదువుల తల్లిని కామాంధులు చిదిమేశారు.

హర్యానా రాష్ట్రం మహేందర్‌ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతిని కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం బాధితురాలిని బస్‌స్టాప్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు.

అత్యాచారానికి గురైన బాధితురాలు... ఇంటర్‌ ఎగ్జామ్స్‌లో ఐదేళ్ల క్రితం టాపర్‌గా నిలిచింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచి.. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకుంది.

Untitled Document
Advertisements