'యాత్ర' లో విజయ్ దేవరకొండ భాగం కానున్నాడా ?

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 11:51 AM

 'యాత్ర' లో విజయ్ దేవరకొండ భాగం కానున్నాడా ?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు నడుస్తుంది అందుకు భిన్నంగా వై యస్ రాజశేఖర్ రెడ్డి జీవితమ్ లోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర'.సినిమా లో వై యస్ జీవిత చరిత్ర ను కాకుండా 2004 లో ఆంధ్రప్రదేశ్ దిశను మార్చిన రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను మాత్రమే చుపించాబోతున్నారట . ఇందులో మమ్ముట్టి వై యస్ ఆర్ పాత్రను పోషించనున్న విషయం తెలిసిందే, ఇప్పటికే పోసాని కృష్ణ మురళి,అనసూయ భరద్వాజ్ లాంటి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా లో అతి కీలకమైన పాత్ర వై యస్ జగన్, ఈ పాత్ర కి మొదటగా తమిళ హీరో కార్తి ని అనుకున్నప్పటికీ లేటెస్ట్ గా 'నోటా' సినిమాతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న విజయ్ దేవరకొండ పేరును పరిశీలనలో ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం, దీనికి సంభందించిన అధికారిక ప్రకటన ఇంకా వేలువడాల్సింది ఉంది. నోటా సినిమాతో పొలిటికల్ డ్రామా నేపధ్యం లో నటిస్తున్న విజయ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అని విజయ్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

Untitled Document
Advertisements