తెరాస పాలన లో విధ్యా వ్యవస్థ నిర్వీర్యమైంది : భూపతి రెడ్డి

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 12:08 PM

తెరాస పాలన లో విధ్యా  వ్యవస్థ నిర్వీర్యమైంది : భూపతి రెడ్డి

ఢిల్లీ :తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇవాళ ఢిల్లీ లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కొత్త రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. తెరాస పాలన లో విధ్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

రైతు బంధు ఓ విఫల పథకమని, కౌలుదారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులకు డబ్బిచ్చే బదులు, ఆ నిధులతో గిట్టుబాటు ధర కల్పించివుంటే బాగుండేదని భూపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ధనిక తెలంగాణను రుణ తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని నిప్పులు చెరిగారు. నిజామాబాద్ రూరల్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు.

Untitled Document
Advertisements