నితిన్ కొత్త సినిమా లో టాప్ హీరోయిన్

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 12:19 PM

నితిన్ కొత్త సినిమా లో టాప్ హీరోయిన్


శ్రీనివాస కళ్యాణం సినిమాతో నిరాశచెందిన నితిన్ కథల విషయం లో మరింత జాగ్రత్త అవసరం అనుకున్నాడేమో తదుపరి ప్రాజెక్ట్ కు కొంత గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడు 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తన నెక్స్ట్ సినిమాను ప్రారంభించాడు.
ఈ సినిమాకు 'భీష్మ' అనే టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు రాష్మిక మందన్న సంప్రదించారని, తనను తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిన వెంకి దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడం మరియు కథ నచ్చడంతో రష్మిక కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం దేవదాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది,గీత గోవిందం సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఫ్యామిలి ఆడియన్స్ నుండి నీరాజనాలు అందుకుంటున్న రష్మిక భీష్మ సినిమాతో నితిన్ కి కూడా సక్సెస్ ఇవ్వబోతుందా అనే విషయం వేచి చూడాలి .

Untitled Document
Advertisements