కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారు : మంత్రి సోమిరెడ్డి

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 02:54 PM

 కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారు :  మంత్రి సోమిరెడ్డి

అమరావతి : బాబ్లీ ప్రాజెక్టు ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాలో మహా కూటమిని దెబ్బతీయడానికే కేసులు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుని ప్రత్యక్షంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా ఉద్యమాలు చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల్లో కేసు వెనక్కి తీసుకోకపోతే మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు.

Untitled Document
Advertisements