సౌత్ లో ఎవ్వరు చేయని పని చేస్తానంటున్న తమన్నా

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 04:12 PM

సౌత్ లో ఎవ్వరు చేయని పని చేస్తానంటున్న తమన్నా

టాలీవుడ్ లోని స్టార్స్ అందరితోనూ నటించినా ఏ హీరో కి సరైన సక్సెస్ ఇవ్వలేకపోయిన తమన్నా తరువాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన బాడ్ లక్ ని ప్రూవ్ చేసుకుంది.అయితే త్వరలోనే సినీ పరిశ్రమకి ఈ మిల్కీ బ్యూటీ గుడ్ బై చెప్పబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం ఎలా ఉన్నా తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువ అని సర్వత్రా వినిపిస్తున్న మాటే , దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత మన టాలీవుడ్ బ్యూటీ లు చక్కగా వంట బట్టించుకున్నారు, ప్రస్తుతం తమన్నా కూడా అదే మంత్రం ఫాలో అవుతుంది టాప్ హీరోయిన్లు అందరు ఒక వైపు సినిమాలు మరోవైపు బిజినెస్ అంటూ అవకాశాలు ఉన్నపుడే కెరీర్ సెటిల్ చేసుకునే పనిలో పడ్డారు ఇపుడు తమన్నా కూడా తనకి ఇష్టమైన డైమండ్ జ్యువలరీ రంగంలో ఎంట్రీ ఇవ్వబోతుందట అందులో భాగంగానే తన పేరుపై సొంత బ్రాండ్ ని లాంచ్ చేసే పనిలో బిజీ గా ఉందట. అయితే సౌత్ లో ఏ హీరోయిన్ పేరు మీద కూడా ఇప్పటివరకు బ్రాండ్స్ లేకపోవటం గమనార్హం. ప్రస్తుతం తమన్నా F2 , క్వీన్ రీమేక్ సినిమాలలో నటిస్తుంది.





Untitled Document
Advertisements