కేసులకు భయపడను : చంద్రబాబు

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 06:17 PM

కేసులకు భయపడను : చంద్రబాబు

కర్నూలు : బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంలో నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

"నేను ఎలాంటి తప్పు చేయలేదు, దేనికీ భయపడేది లేదు ఇలాంటి కేసులతో నన్ను ఏమీ చేయలేరని" అన్నారు. ‘ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే ఉద్దేశ్యంతో నిరసన తెలపడానికే మేము బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లాం. అయితే ఉమ్మడి సమైక్య రాష్ట్ర సరిహద్దులోనే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పని చేసినా ప్రజల కోసమే పని చేశానే తప్ప తన కోసం ఏదీ చేయలేదని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశా. తెలుగు జాతికి నష్టం వస్తుందని బాబ్లీ ప్రాజెక్ట్‌పై పోరాడాను. కేసు గురించి న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’అని ఆయన పేర్కొన్నారు.

Untitled Document
Advertisements