లారెన్స్ కు అరుదైన గౌరవం

     Written by : smtv Desk | Sat, Sep 15, 2018, 10:15 AM

 లారెన్స్ కు అరుదైన గౌరవం

చెన్నై: ప్రభుదేవా శిష్యుడు, మెగాస్టార్ వీరాభిమాని అయిన రాఘవ లారెన్స్ ఓ అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకున్నారు, అంటే ఇదేదో సినిమా అవార్డు అనుకునేరు సినిమాలకు ఏ మాత్రం సంభంధం లేకుండా తన సేవా దృక్పధం వలన ఆయనను ఈ అవార్డు వరించింది.

తన సేవా ట్రస్ట్ ద్వారా 150 మందికి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించిన కారణం గా ప్రముఖ సినీ దర్శకుడు మరియు నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ మదర్ తెరిస్సా అవార్డును అందుకున్నారు, మదర్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ అవార్డును అందించారు.కాగా గతం లో కూడా లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ సామీ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేసారు.





Untitled Document
Advertisements