యాక్షన్ కి రెడీ అంటున్న RX 100 హీరోయిన్

     Written by : smtv Desk | Sat, Sep 15, 2018, 12:49 PM

యాక్షన్ కి రెడీ అంటున్న  RX 100 హీరోయిన్


చాల మంది హీరోయిన్స్ మేము చేయలేము అని చేతులెత్తేసిన RX 100 కథను ఎంచుకోవడమే కాకుండా తన నటనతో వంద శాతం న్యాయం చేసింది పాయల్ రాజ్ పుత్, తన ధైర్యానికి మెచ్చిన టాలీవుడ్ దర్శకులు పాయల్ ని అవకాశాలతో ముంచెత్తుతున్నారు, కాని పాయల్ మాత్రం కథను ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్దట.
మొదటి సినిమాతోనే యువత లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న పాయల్ ప్రస్తుతం సీ కల్యాణ నిర్మించనున్న సినిమాకి సంతకం చేసిందని వార్తలు రాగా ఇప్పుడు దర్శకుడు బాను శంకర్ సినిమాలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుందని అయితే పాయల్ మొదటి సినిమాకి భిన్నమైన కారెక్టర్ లో కనిపించనుందని కొన్ని యాక్షన్ సన్నివేశాలని కూడా పాయల్ పై చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా పాయల్ సినిమాలో ఉందంటే యువత సినిమాకి క్యూ కట్టే అంతగా పాపులారిటీని తెచ్చిపెట్టింది RX 100 సినిమా . దర్శకుడు బాను శంకర్ పూర్వం వరున్ సందేశ్ హీరో గా 'సరదాగా అమ్మాయితో' సినిమాని తెరకెక్కించారు.





Untitled Document
Advertisements