అవకాశం వస్తే వదులుకోను

     Written by : smtv Desk | Sat, Sep 15, 2018, 05:01 PM

అవకాశం వస్తే వదులుకోను

చెన్నై: కరన్‌జిత్‌ కౌర్‌ సీజన్‌–2 ప్రమోషన్ లో భాగంగా నటి సన్నీ లియోన్ చెన్నై ను సందర్శించారు శుక్రవారం ఏర్పాటైన విలేకరుల సమావేశం లో ఆమె ముచ్చటించారు, కరన్‌జిత్‌ కౌర్‌ సీజన్‌–1 ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు సీజన్ 2 కూడా తప్పకుండా ప్రేక్షకులని అలరిస్తుందని నమ్మకం వ్యక్తపరిచారు, తన సినిమాలకి భాష బేధం లేకుండా అన్ని భాషల ప్రజలు తనని ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు.

దక్షణాది నుండి కూడా తనకి అవకాశాలు వస్తున్నాయి అని, త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అదే విధంగా తమిళ స్టార్స్ తో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానని కాని గ్లామర్ పేరుతో హద్దులు దాటే ప్రయత్నం చేయనని స్పష్టీకరించారు.





Untitled Document
Advertisements