‘అరవింద సమేత వీరరాఘవ’: అనగనగ లిరికల్ వీడియో

     Written by : smtv Desk | Sat, Sep 15, 2018, 05:21 PM

‘అరవింద సమేత వీరరాఘవ’:  అనగనగ లిరికల్ వీడియో

హైదరాబాద్: త్రివిక్రమ్, ఎన్ టి ఆర్ కలయికలో పూజ హెగ్దే కథానాయికగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'అరవింద సమేత వీరా రాఘవ.' ఎస్ రాధాకృష్ణ నిర్మాత, చివరి దశ చిత్రీకరన జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ నెల 20 న పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు, ఈ నేపథ్యం లో "అనగనగా అరవింద అట తన పేరు అందానికి సొంతూరు ..అందుకే ఆ పొగరు" అంటూ సాగే లిరికల్ వీడియో ను శనివారం విడుదల చేశారు,"టఫ్ఫ్ గా కనిపిస్తారు కాని ...పర్లేదు మాట వింటారు" అంటూ హీరోయిన్ హీరో తో చెప్పే డయలాగ్ తో విడియో మొదలవుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకి థమన్ బాణీలు చక్కగా కుదిరాయి.





Untitled Document
Advertisements