రజనీకాంత్ కు పోటీగా శివకార్తికేయన్?

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 12:21 PM

రజనీకాంత్ కు పోటీగా శివకార్తికేయన్?


చెన్నై: టెలివిజన్ యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరో ల జాబితాలో స్థానం సంపాదించిన తమిళ హీరో శివకార్తికేయన్, రేమో, రజని మురుగన్ చిత్రాలతో మాస్ హీరో గా కూడా నిలదొక్కుకోగాలిగారు. మనసుకు నచ్చితే చాలు ప్రాంతీయ బేధాలు కూడా లేకుండా ఆదరించే తమిళ తంబీలు ఇప్పుడు శివకార్తికేయన్ ను అందలం ఎక్కించారు.
తాజాగా శివకార్తికేయన్ నటించిన 'సీమరాజా' చిత్రం గతం లో ఎన్నడు లేని విధంగా విడుదలైన మొదటి రోజే 13.5 కోట్ల వసూళ్లు సాదించాయి,
సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాలో శివకార్తికేయన్ రెండు భిన్నమిన పాత్రలను అద్భుతంగా పండించాడు, ఈ సినిమా పై కొన్ని వర్గాల్లో మిశ్రమ స్పందన వినిపిస్తున్నా శివకార్తికేయన్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ హీరో జోరు చూసిన సినీ విశ్లేషకులు త్వరలోనే విజయ్, రజనీకాంత్ లాంటి పెద్ద హీరో లకు పోటి ఇస్తాడని జ్యోతిష్యం చెబుతున్నారు.





Untitled Document
Advertisements