ప్రశాంత్ కిశోర్ రాజకీయ అరంగ్రేటం

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 12:28 PM

ప్రశాంత్ కిశోర్ రాజకీయ అరంగ్రేటం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ అరంగ్రేటం చేశారు. ఇన్నాళ్లు పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన..ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. ఈ రోజు ప్రశాంత్ కిశోర్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదశ్-యునైటెడ్(జేడీయూ)లో చేరారు. పట్నాలో ఈ రోజు జరిగే జేడీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన రాజకీయ చేరికను ధ్రువీకరిస్తూ ఆదివారం ఉదయం ‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ చేరికపై సీఎం నితీశ్ మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రశాంత్ కిశోర్ దేనని జోస్యం చెప్పారు. 2012లో గుజరాత్ ఎన్నికల్లో, 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్, అమిత్ షాతో భేదాభిప్రాయాల కారణంగా విడిపోయారు

ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా అవతారమెత్తారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) వ్యవస్థాపక సభ్యుల్లో ప్రశాంత్ కిశోర్ ఒకరు. 2014 ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పనిచేసి మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పనిచేసి సక్సెస్ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉండి..కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. ఐతే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ విఫలమయ్యారు. ఏపీలో వైసీపీకి సైతం విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.





Untitled Document
Advertisements